Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (18:16 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కూలిపోయింది. ఆ సమయంలో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది చనిపోయినట్టు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. వీరిలో భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్ చీఫ్) బిపిన్ రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి ఈ హెలికాఫ్టర్‌లో ప్రయాణంచిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాత్రం ప్రాణాలతో బయటపడినట్టు తొలుత వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆయన శరీరం 90 శాతం మేరకు కాలిపోయినట్టు కనిపించింది. అయితే, బిపిన్ రావత్ మృతి చెందినట్టు అధికారికంగా ప్రటించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ 80 శాతం కాలిన గాయాలతో బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఉన్నది బిపిన్ రావత్తా లేక కెప్టెన్ వరుణా అనేది తేలాల్సివుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments