తమిళనాడు రాష్ట్రంలోని కున్నూరులో ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. అయితే ఈ హెలికాఫ్టరులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పరిస్థితిపై స్పష్టత లేదు.
మరోవైపు, కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరుకు ఈ హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే అంటే బుధవారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో జరిగింది. ఈ హెలికాప్టరులో ప్రయాణించిన 14 మంది వివరాలు వెల్లడయ్యాయి.
వీరిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్.లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్ సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. మరికొందరి పేర్లు తెలియాల్సివుంది.