Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (13:54 IST)
దేశంలో కరోనా కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఇది సార్స్ కోవ్ 2 అనే వైరస్ సహజ పరిణామమేనని అంటున్నారు. ఈ కొత్త వైరస్‌కు ఎక్స్ ఎఫ్.జి. వేరియంట్ పేరు పెట్టినట్టు ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ఈ కొత్త రకం వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. 
 
మరోవైపు, ఈ యేడాది దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జనవరి జూన్ 11 వరకు దేశంలో కోవిడ్ 19 సాధారణ కేసులు ఏడు వేలకు పైగా నమోదయ్యాయి. 74 మంది చనిపోయారు. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ, ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచన చేసింది. 
 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరోసారి భయాందోళనలు కలుగుతుండగా, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ మాత్రం ఆందోళన అక్కర్లేదంటున్నారు. కోవిడ్ 19 వ్యాధిని కలిగించే సార్స్ కోవ్ 2 వైరస్ సహజ పరిణామమే కొత్త ఎక్స్ ఎఫ్.జి వేరియంట్ అని దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలేగానీ ఆందోళన అక్కర్లేదని ఆయన భరోసా ఇచ్చారు. 
 
దేశంలో ఇంతవరకు 206 ఎక్స్.ఎఫ్.జి. కేసులు నమోదయ్యాయని, వీటిలో అత్యధికంగా 89 కేసులు మహారాష్ట్రలో నమోదైనట్టు ఆయన చెప్పారు. ఎక్స్.ఎఫ్.జి ఇంకా తీవ్ర రూపం దాల్చలేదని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించవచ్చని డాక్టర్ భార్గవ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments