Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో శాస్త్రవేత్తల సక్సెస్ హు'షార్' - చరిత్ర సృష్టించిన భారత్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (15:09 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్ర సృష్టించింది. జాబిల్లి అన్వేషణ నిమిత్తం చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతమైంది. దీంతో అంతరిక్ష చరిత్రలో భారత్ మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ప్రయోగం విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై సెప్టెంబరు ఏడో తేదీన అడుగుపెట్టనుంది. 
 
శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2ను మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 20 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తిచేసుకొని మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది. 
 
సాంకేతిక కారణాలతో జులై 15న నిలిచిన ప్రయోగం ఎట్టకేలకు అన్ని సవాళ్లను అధిగమించింది. ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన రాకెట్‌ 16.13 నిమిషాలు ప్రయాణించి చంద్రయాన్‌-2ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
చందమామను చంద్రయాన్‌-2 చేరుకునేందుకు 48 రోజులు పట్టనుంది. భూ కేంద్రం నుంచి చంద్రయాన్‌-2 మాడ్యూల్‌లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్ష్యలను మార్పుచేస్తూ చంద్రుడి వైపు పయనింపజేస్తారు. 23వ రోజున చంద్ర బదిలీ కక్ష్యలోకి చొప్పించనున్నారు.
 
48వ రోజున అంటే సెప్టెంబరు ఏడో తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుంది. అలా జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments