Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమా.. నో ఛాన్స్: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:26 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్పందిస్తూ అమెరికాకు ఝలక్ ఇచ్చారు. భారతదేశం ప్రారంభం నుంచి విదేశీ వ్యవహారాల్లో తనకంటూ ఓ పద్ధతిని అవలంబిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి భారత్-పాక్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం జోక్యాన్ని.. చివరకు ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కూడా అంగీకరించడం లేదు. 
 
అదే భారత విదేశాంగ విధానం. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్పర్ధలు సవరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియరాగానే.. భారత్ స్పందించింది. అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ విషయంలో రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం రాగానే.. భారత్ ఎన్నటికీ తృతీయ దేశం జోక్యాన్ని సహించదు.
 
ఇంకా భారత్- పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించు కోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో దేశ ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా భారత్ తిరస్కరించింది. ఈ ప్రకటన ప్రధాని మోడీ ఆదేశాల మేరక విడుదలైనట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments