Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (14:23 IST)
ఒరిస్సా రాష్ట్ర వాసుల పంట పండిది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారు ఖనిజ నిక్షేపాలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ అండియా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలోని సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్, జిల్లాల్లో ఇప్పటికే బంగారు గనులు వెలికితీత పనులు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. 
 
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు చుక్కలను తాకుతున్న తరుణంలో ఒరిస్సాలో బంగారు నిక్షేపాలు వెలుగు చూడటం ఇపుడు ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తమ రాష్ట్రం సుసంపన్న రాష్ట్రంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే, మయూర్ భంజ్ జిల్లాలోని ఝూసిపూర్, సూర్యాగుడా రువంశి, ఇదెల్కుచా, మారెడిమి, సులేపట్, బడం పహాడ్‌లలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అలాగే, దేవగఢ్ జిల్లాలోని అదసా, రాంపల్లి, కియోంజర్ జిల్లాలో గోపూర్, గజీపూర్, మంకాడ్ చువాన్, సులేకానా, దిమిరి ముండా, మల్కాన్ గిరి, సంబల్ పూర్ బౌద్ జిల్లాల్లో సైతం పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments