ఒడిశాలో బాలికలు, మహిళలపై లైంగిక దోపిడీ పెరుగుతున్న నేపథ్యంలో, కంధమాల్ జిల్లాలోని ప్రభుత్వ నివాస వసతి గృహాలలో నివసిస్తున్న ఇద్దరు 10వ తరగతి మైనర్ విద్యార్థినులు సాధారణ ఆరోగ్య తనిఖీల సమయంలో గర్భవతిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తుముడిబంధ బ్లాక్‌లోని రెండు వేర్వేరు ప్రభుత్వ నివాస బాలికల ఉన్నత పాఠశాలల నుండి ఈ కేసులు నమోదయ్యాయి. గత నెలలో వేసవి సెలవుల తర్వాత బాలికలు తమ హాస్టళ్లకు తిరిగి వచ్చినప్పుడు వారు గర్భవతులుగా వున్నట్లు తెలిసింది.
హాస్టల్ అధికారులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. సెలవులకు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు విద్యార్థులు శానిటరీ న్యాప్‌కిన్‌ల కోసం వార్డన్ వద్దకు వెళ్లకపోవడంతో అనుమానాలు తలెత్తాయని తెలుస్తోంది. ఆ తర్వాత వారిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లగా, వారు గర్భవతి అని తేలింది.