ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానంతో ఆ మతానికి చెందిన మహిళలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నవిషయానికే కట్టుకున్న భర్తలు తమకు తలాక్ చేప్పేస్తున్నారు. దీంతో అనేక మంది ముస్లిం మహిళలు నడిరోడ్డుపై పడుతున
ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానంతో ఆ మతానికి చెందిన మహిళలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నవిషయానికే కట్టుకున్న భర్తలు తమకు తలాక్ చేప్పేస్తున్నారు. దీంతో అనేక మంది ముస్లిం మహిళలు నడిరోడ్డుపై పడుతున్నారు.
తాజాగా భార్య పొరపాటున రోటీ మాడ్చిందనే కారణంతో ఓ భర్త తలాక్ ఇచ్చాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా పహరేతా గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తరచూ వేధిస్తున్నాడని, సిగరెట్లతో శరీరంపై వాతలు పెట్టేవాడని వాపోయింది. వంట చేసే సందర్భంలో రోటీలు కొంచెం మాడాయని.. ఆగ్రహించిన భర్త తలాక్ చెప్పాడని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కాగా, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే విషయంపై కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శాయశక్తులా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశం ఇపుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉన్న విషయం తెల్సిందే.