Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు మాంసంకూర వడ్డించి.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందో తెలుసా?

భార్య చేతుల్లో భర్తలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భార్యల చేతుల్లో హతమైపోతున్న భర్తల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఓ భార్య... తన భర్తకు మాంసంకూర వడ్డించి ప్రియుడితో కలిస

Advertiesment
భర్తకు మాంసంకూర వడ్డించి.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందో తెలుసా?
, మంగళవారం, 10 జులై 2018 (08:53 IST)
భార్య చేతుల్లో భర్తలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భార్యల చేతుల్లో హతమైపోతున్న భర్తల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఓ భార్య... తన భర్తకు మాంసంకూర వడ్డించి ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిపై దాడి చేసింది. ఈ దాడి నుంచి అతను తృటిలో తప్పించుకోగా, ఆమె మాత్రం తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో జరిగింది.
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు,  దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వినుకొండ డానియేలుకు అదే గ్రామానికి చెందిన రత్నకుమారితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కంభంపాటి బెంజిమెన్‌ అనే వ్యక్తి కేసానుపల్లి ఎస్సీ కాలనీలో చర్చి ఫాదర్‌గా చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రత్నకుమారికి బెంజిమెన్‌‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని రత్నకుమారి భావించి, తన ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భోజనం పెట్టాలని భార్యను డానియేలు అడిగాడు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నిద్రమాత్రలను భర్తకు మాంసం కూరలో కలిపి పెట్టింది. కడుపునిండా ఆరగించిన డానియేలు మంచంపై పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత తమ ముందస్తు పథకంలో భాగంగా, బెంజిమెన్‌... రత్నకుమారి సహకారంతో ఇంట్లోకి ప్రవేశించి, నిద్రపోతున్న డానియేలు ముఖంపై దిండువేసి బలవంతంగా నొక్కాడు. 
 
ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో నిద్రమత్తులోనే ఉలిక్కిపడిన డానియేలు పెద్దగా కేకలు వేశాడు. పక్క ఇంటిలో నిద్రపోతున్న వృద్ధులు ఆ అరుపులు విని చుట్టుపక్కల వారికి తెలిపారు. డానియేలు అన్న వినుకొండ మోషే వెంటనే అక్కడికి చేరుకుని, డానియేలుపై జరుగుతున్న హత్యాయత్నాన్ని గమనించి బెంజిమెన్‌ నుంచి అతడిని రక్షించాడు. ఈలోగా కాలనీవాసులు అక్కడకు చేరుకోవడంతో బెంజిమెన్‌, రత్నకుమారి అక్కడ నుంచి జారుకున్నారు. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతన్నారు. పరారీలో ఉన్న బెంజిమెన్, రత్నకుమారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు చూడాలని హస్త ప్రయోగం చేశాడు... ఎక్కడ?