Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీఏ అంటే... నో డేటా అవైలబుల్ : రాహుల్ గాంధీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:00 IST)
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త నిర్వచనం చెప్పారు. ఎన్డీయే అంటే నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ కాదనీ, ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు. 
 
వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై ఆయన ఈ విధంగా సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు.. జవాబుదారీతనం కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్డీయే అనే పదానికి తనదైన నిర్వచనం ఇచ్చారు. 
 
ఆక్సిజన్‌ కొరత కారణంగా చనిపోవడం గానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఎవరూ చనిపోవడం గానీ జరగలేదన్న విషయం ప్రజలు నమ్మాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందని రాహుల్‌ గాంధీ అన్నారు. 
 
మూకదాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి వాటిపైనా ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రభుత్వం వద్ద డేటా లేదు.. సమాధానం లేదు.. జవాబుదారీతనం అసలే లేదని ట్వీట్‌చేశారు.
 
కొవిడ్‌ లాక్డౌన్‌ సమయంలో నడకదారిన వెళ్లిన చాలా మంది మరణించారు. దీనిపై కేంద్రం అప్పట్లో తమ వద్ద అలాంటి డేటా ఏదీ లేదని పేర్కొంది. రెండో వేవ్‌ సందర్భంగా ఆక్సిజన్‌ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఎవరూ తమ వద్ద ఆ డేటా లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఇలా పలు సందర్భాల్లో కేంద్రం తమ వద్ద డేటా లేదని సమాధానం ఇవ్వడంపై రాహుల్‌ ఈ విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments