Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు - సర్కారు జీవో జారీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (11:45 IST)
విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలను 31కు పెంచారు. ఇపుడు కొత్తగా మరో 13 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
 
కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సారూర, మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం కేంద్రాలుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments