పీకల వరకు మందుకొట్టి తాళికట్టబోయిన వరుడు.. ఛీపో అన్న యువతి.....

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (09:07 IST)
మరికొన్ని క్షణాల్లో ముహూర్తం. అప్పటివరకు బాగానే ఉన్న వరుడు... తాళికట్టబోయే సమయానికి పీకల వరకు మద్యం సేవించాడు. ఈ మద్యం మత్తులోనే వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధపడ్డాడు. వరుడు మద్యం సేవించిన విషయాన్ని పసిగట్టిన యువతి.. పెళ్లి పీటలపై నుంచి లేచి.. ఛీపో.. అంటూ చీదరించింది. తాళి కట్టించుకునేందుకు ససేమిరా అంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి వరుడుతో పాటు అతని తండ్రిని కూడా అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బీహార్ రాష్ట్రంలని భాగల్‌పూర్‌లోని తిలక్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి అదే ఊరికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లి కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు. తీరా ముహూర్తం సమయానికి తాను పెళ్లి కొడుకును అన్న గర్వమో, స్నేహితులు కోరారో తెలియదు కానీ వరుడు మాత్రం పూటుగా మందుకొట్టి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. తాళి కట్టే సమయంలో అతను మద్యం తాగివున్నాడని వధువు పసిగట్టింది. 
 
ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పింది. అమ్మాయికి నచ్చజెప్పేందుకు ఇరు కుటుంబాల పెద్దలు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇక్కడే అసలు కొత్త ట్విస్ట్ మొదలైంది. ప్రస్తుతం బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలు అవుతున్న నేపథ్యంలో మందు తాగినందుకు వరుడితో పాటు అతడి తండ్రిని పోలీసులు ఎక్సైజ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇంతకీ వరుడు పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments