నటి రన్యా రావు బంగారాన్ని ఎక్కడ దాచి తెచ్చేవారో తెలుసా?

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (13:32 IST)
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి ఉన్నారు. ఆమె వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, దుబాయ్‌లో బంగారు కొనుగోలు చేసిన రన్యారావు.. స్విట్జర్లాండ్ వెళుతున్నట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులను నమ్మించింది. 
 
కానీ, ఆమె అక్రమ బంగారంతో భారత్‌కు చేరుకునేవారు. స్వదేశీ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు వీఐపీలను ఉపయోగించే గ్రీన్ చానెల్‌ను ఉపయోగించేవారని డీఆర్ఐ అధికారులు విచారణలో వెల్లడైంది. అలాగే, ఆమె దుబాయ్‌లో కొనుగోలు చేసే బంగారాన్ని నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలలో దాచి తెచ్చేవారని గుర్తించారు. విమానాశ్రయంలో గ్రీన్ చానెల్‌లో వెళ్లే వీఐపీలు, కస్టమ్స్ క్లియరెన్స్ లేని వస్తువులను తీసుకెళ్లేవారు. అలా రన్యా రావు పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్టు డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.  
 
గత యేడాది ఆఖరులో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె... దానిని తీసుకుని తాను స్విట్జర్లాండ్‌ వెళుతున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు వెల్లడించారు. కానీ, ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్టు వెల్లడైందని డీఆర్ఐ అధికారులు తమ అరెస్టు మెమోలో పేర్కొన్నారు. పైగా విమానాశ్రయంలో గ్రీన్ చానెల్ ద్వారా వెళుతున్నపుడు తన వద్ద సుంకాలు విధించే విలువైన వస్తువులు ఏవీ లేవని నమ్మించారు. కానీ మెటల్ డిటెక్టర్ వద్ద దొరికిపోయారు. ఆ తర్వాత బెంగుళూరు విమానాశ్రయ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఈ అంశంపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు సీబీఐ కూడా కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments