IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 25వ తేదీ నుంచి భారీ వర్షాలు

సెల్వి
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (10:36 IST)
సెప్టెంబర్ 25వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుండటంతో.. తెలంగాణలో సైతం భారీ వర్షాల నమోదుకు అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న ఏర్పడే ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
వచ్చే 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. 
 
ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
 అల్పపీడనంతో పాటు, ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య ఉత్తరప్రదేశ్, బిహార్‌ ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments