Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధాలు... 184 హత్యలు... ఎక్కడ?

ప్రతి ఏడాది ముగింపులో ఆయా రాష్ట్రాల్లో నేరాలు, హత్యలు గురించి గణాంకాలను ప్రకటించడం మామూలే. ఇందులో భాగంగా 2016 సంవత్సరానికి గాను మహారాష్ట్రకు చెందిన నేరాల చిట్టాను బయటపెట్టింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఈ జాబితాలో మహారాష్ట్రలో 2,299 మంది హత్యకు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (14:17 IST)
ప్రతి ఏడాది ముగింపులో ఆయా రాష్ట్రాల్లో నేరాలు, హత్యలు గురించి గణాంకాలను ప్రకటించడం మామూలే. ఇందులో భాగంగా 2016 సంవత్సరానికి గాను మహారాష్ట్రకు చెందిన నేరాల చిట్టాను బయటపెట్టింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఈ జాబితాలో మహారాష్ట్రలో 2,299 మంది హత్యకు గురైనట్లు తేలింది. వీరిలో 184 మంది కేవలం వివాహేతర సంబంధాల కారణంగా హత్యకు గురయ్యారు. 
 
ఈ గణాంకాలతో దేశంలోనే వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు జరిగిన మూడో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిలవగా, వివాహేతర సంబంధాల కారణంగా ఇక్కడ హత్యకు గురైనవారి సంఖ్య 284. రెండో స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. ఇక్కడ 195 మంది వివాహేతర సంబంధాల కారణంగా హత్య చేయబడ్డారు. 
 
ఇక ప్రేమ గొడవలు కారణంగా నెలకు ఆరుగురు చొప్పున మహారాష్ట్రలో హత్య చేయబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆస్తి గొడవలు, వ్యక్తిగత కక్షలు మామూలే. ఇలా మొత్తమ్మీద చూసుకున్నప్పుడు 2016లో మహారాష్ట్రంలో 2,299 హత్యలు జరిగాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments