Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడు కోరాడని ఫ్రెండ్స్ నగ్న ఫోటోలను పంపింది.. చివరికి ఆత్మహత్య చేసుకుంది...

తన ప్రేమికుడు కోరాడని.. తన హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను అతనికి పంపిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తన ప్రియుడు కోరాడు కదా అని చెయ్యకూడని పని చేసి

Advertiesment
ప్రియుడు కోరాడని ఫ్రెండ్స్ నగ్న ఫోటోలను పంపింది.. చివరికి ఆత్మహత్య చేసుకుంది...
, గురువారం, 28 సెప్టెంబరు 2017 (15:55 IST)
తన ప్రేమికుడు కోరాడని.. తన హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను అతనికి పంపిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తన ప్రియుడు కోరాడు కదా అని చెయ్యకూడని పని చేసిన ఆ యువతి.. ప్రియుడితోనే కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో హాస్టల్‌లో ఉంటూ, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతున్న 21 సంవత్సరాల వృశాలి లండే మేల్ నర్సుగా పని చేస్తున్న సురేశ్‌‌తో ప్రేమలో ఉంది. అయితే సురేశ్ తన ప్రియురాలిని ఓ కోరిక కోరాడు. అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్‌‌కు పంపి సదరు యువతి పెద్ద తప్పు చేసింది. 
 
ఈ నేపథ్యంలో వృశాలీ సెల్ ఫోన్‌లో సురేష్‌తో జరిగిన చాటింగ్‌ను చూసిన ఓ హాస్టల్ రూమ్మేట్, మొత్తం విషయాన్నీ వెలుగులోకి తెచ్చింది. సురేష్‌ బలవంతం మేరకు ఆ పని చేశానని చెప్పడంతో కాగితంపై సురేష్‌ను కలవకూడదని.. కలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగితంపై దీన్ని రాసి తీసుకున్నారు. అయినా, సురేష్‌తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. 
 
ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి సురేష్‌కు జరిగిందంతా చెప్పింది. తన స్నేహితులు ఎక్కడ కేసు పెడతారోనన్న భయంతో వృశాలి సురేష్  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానం మిస్సైంది.. డ్యాన్స్ చేస్తూ టైమ్ ఎలా గడిపిందంటే? (వీడియో)