Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో చాటింగ్... భర్త తన వాట్స్ యాప్ చూసాడని నరికేసింది...

భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తేడా వస్తే ఒకరిని ఇంకొకరు చంపుకోవడం జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (13:06 IST)
భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తేడా వస్తే ఒకరిని ఇంకొకరు చంపుకోవడం జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలను చూస్తే.... బేరాఘర్ లోని ఖిలావలి గ్రామంలో నేత్రాపాల్, నీతూసింగ్ దంపతులున్నారు. వీరికి 2014లో వివాహం అయ్యింది. కానీ నీతూసింగుకు ఆల్రెడీ మరో అబ్బాయితో ఎఫైర్ వుంది. ఈ సంగతి తెలిసి భర్త నిలదీస్తే... అతడితో గొడవకు దిగింది. దాంతో చేసేది లేక అతడు ఆమె నుంచి దూరంగా వుంటున్నాడు కానీ విడాకులు ఏమీ తీసుకోలేదు. తాజాగా ఓ ఫ్యామిలీ వేడుకకు ఇద్దరూ వచ్చారు. 
 
ఆ సమయంలో నీతూ సింగ్ తన ప్రియుడితో జోరుగా చాటింగ్ చేస్తూనే వుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన భర్త నేత్రాపాల్ ఆమె చాటింగ్ చేస్తున్న ఫోనును అడిగాడు. అందుకామె తిరస్కరించింది. దాంతో అతడు ఫోనును బలవంతంగా ఆమె దగ్గర్నుంచి లాగేసుకున్నాడు. వెంటనే వాట్స్ యాప్ లో భార్య తన ప్రియుడితో చేసిన చాటింగ్ చూస్తూ వున్నాడు. 
 
తన భర్త చేష్టలను భరించలేని ఆ ఇల్లాలు ఓ కత్తిని తీసుకుని అతడి తలపై బలంగా నరికింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ప్రియుడిని తీసుకుని పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన నేత్రాపాల్ ను బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత నీతూసింగ్, ఆమె ప్రియుడి ఆచూకి తెలుసుకుని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments