Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ అంత ఖర్చు చేసిందా? ఎమ్మెల్యేలకు రూ.6కోట్లు.. స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాల ఫైర్..

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత ఆమె స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే చిన్నమ్మ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న చిన్నమ్మ ప్రస్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (12:32 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత ఆమె స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే చిన్నమ్మ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న చిన్నమ్మ ప్రస్తుతం పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈ మధ్య దినకరన్ కూడా అరెస్టు కావడంతో.. అమ్మ పార్టీలోని వర్గాలన్నీ ఏకమవుతాయని ప్రజలు అనుకున్నారు. కానీ అది జరగలేదు.
 
ఈ నేపథ్యంలో చిన్నమ్మ పన్నీర్ సెల్వంను సీఎం కుర్చీ నుంచి  దింపేందుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తేలింది. తాజాగా ఓ ఛానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.6కోట్లు ఇచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. చిన్నమ్మ అంత మొత్తంలో డబ్బులివ్వనున్నట్లు చెప్పడంతోనే ఆమెను అనుకూలంగా ఓటేసినట్లు సదరు ఎమ్మెల్యే మాటలను బట్టి తేలిపోయింది. నోట్లరద్దుతో కరెన్సీకి ఇబ్బందిగా వుండడంతో కొంతమొత్తాన్ని బంగారం రూపంలో ఇచ్చినట్టు కూడా ఎమ్మెల్యే చెప్పారు. 
 
చిన్నమ్మ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతిచ్చేందుకు ఏకంగా 15 రోజుల పాటు చెన్నై శివారులోని కూవత్తూరు రిసార్టులో  కొలువుదీరారు. ఓ ఇంగ్లీష్, తమిళ ఛానల్స్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో మదురై దక్షిణ ఎమ్మెల్యే శరవణన్‌ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్‌పై పళని వర్గం మండిపడుతోంది. ఇది బూటకమంటోంది.
 
ఎమ్మెల్యేలకు పైసా కూడా ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకే పన్నీర్ వర్గం ఇలా చేస్తుందని ఆరోపించింది. కానీ ఈ స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తు జరపాలని.. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డీఎంకే పట్టుబడుతోంది. బలపరీక్ష సమయంలోనూ పళనిసామి టీమ్ దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని డీఎంకే నేతలు గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments