Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీ.. ఛీ... బాంబే ఐఐటీ విద్యార్థి పాడుబుద్ధి... ఏం చేశాడో తెలుసా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:32 IST)
అతనో ఉన్నత విద్యా సంస్థలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఓ మహిళ స్థానం చేస్తుండగా, ఫోటోలు తీయడానికి ప్రయత్నించి జైలుపాలయ్యాడు. అతని పేరు అవినాష్ కుమార్ యాదవ్. బాంబే ఐఐటీలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. 
 
థానేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ చదువుకుంటున్నాడు. కానీ, అతను ధ్యాసంతా చదువుపై కాకుండా వక్రమార్గంలో పెట్టాడు. పక్క ప్లాట్‌ బాత్‌రూమ్‌లో మొబైల్‌ ఫోన్‌ను అమర్చాడు. ఈ క్రమంలో సదరు ప్లాట్‌లో నివాసం ఉంటున్న మహిళ స్నానం చేయడానికి వెళ్లినప్పుడు బాత్‌రూమ్‌ కిటికిలో సెల్‌ఫోన్‌ ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. 
 
ఆ సమయంలో అవినాష్‌ అక్కడే తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. మొబైల్‌ను స్వాధీనం చేసుకుని చూడగా అపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళలతో పాటు స్నానం చేస్తున్న పురుషుల ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో వారు  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరీరలో ఉన్న అవినీష్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments