Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం... హత్య.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (08:51 IST)
ఏపీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మొన్నటికి మొన్న జ్యోతి ఘటన మరవక ముందే.. పశ్చిమ గోదావరిలో ఓ యువతిపై దారుణం చోటుచేసుకుంది. ఆదివారం తన ప్రేమికుడితో అలా బయటికి వెళ్లిన యువతిపై అత్యాచారంతో పాటు హత్య జరిగింది. 
 
ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఆపై యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా... యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి, కామవరపు కోచ మండలం, జీలకర్రగూడెంలోని బౌద్ధరామాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బౌద్ధరామాల సందర్శనకు వెళ్లిన ప్రేమ జంటపైనే ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారి గూడెం వారిగా పోలీసులు గుర్తించారు.
 
బౌద్ధారామాలు అటవీప్రాంతంలో ఉండడం, జనసంచారం తక్కువగా ఉండడం వల్లే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జనసంచారం లేని ప్రాంతాలకు ప్రేమికులు అలా పర్యటనకు వెళ్లడం సురక్షితం కాదని.. పోలీసులు చెప్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని... వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments