ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని నమ్మని వ్యక్తి 24 గంటలు భగవంతుడి సేవలో తరించాలని నిర్ణయించుకుని సన్యాసం పుచ్చుకోనున్నాడు.
ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని నమ్మని వ్యక్తి 24 గంటలు భగవంతుడి సేవలో తరించాలని నిర్ణయించుకుని సన్యాసం పుచ్చుకోనున్నాడు.
అతని పేరు సంకత్ ప్రకాశ్ (29). ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఇంకా మంచి స్థానాలకు ఎదుగాలని, అమెరికాలో పీజీ చేయాలని కలలు కన్నాడు. కానీ, ఓ స్నేహితుడి ద్వారా అతడి జీవితం మారిపోయింది. నాస్తికుడైన అతడు ఆధ్యాత్మికం వైపు మళ్లాడు.
ఈనెల 22న ముంబైలో జరుగనున్న ఓ కార్యక్రమంలో అతడు జైనమత సన్యాసం పుచ్చుకోనున్నాడు. వాస్తవానికి సంకత్‌ప్రకాశ్ వైష్ణవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఐఐటీలో తన సీనియర్, జైనమత సన్యాసి అయిన భవిక్ షాతో స్నేహం అతడి జీవితాన్ని మార్చివేసింది. దీంతో సంకత్‌ప్రకాశ్ జైనమతం స్వీకరించాడు. అంతేగాక తన జీవితాన్ని జైనమత వ్యాప్తికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.