Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయితో దొరికిపోయిన ఐఐటీ బాబా!!

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (19:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో గత నెలలో జరిగిన మహాకుంభమేళాలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా ఇపుడు గంజాయితో చిక్కిపోయాడు. దీంతో ఆయనను జైపూర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న ఐఐటీ బాబా నుంచి గంజాయి, ఇంకా పలు రకాలైన మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై ఐఐటీ బాబా స్పందిస్తూ, తన వద్ద లభించింది గంజాయి కాదని, ప్రసాదం అంటూ వాదిస్తున్నారు. ఈ ప్రసాదం సేవించడం తప్పు అయితే, కుంభమేళాలో అనేక మంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని, వాళ్లందరినీ అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, జైపూర్ పోలీసులు మాత్రం అతనిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఐఐటీ బాబాను స్టేషన్ బెయిలుపైనే విడుదల చేయడం గమనార్హం. 
 
కాగా, కుంభమేళా సందర్భంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ఐఐటీ బాబా... ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ‌‍పై స్పందిస్తూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పరుగులు చేయలేరని, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పారు. కానీ ఈ మ్యాచ్‌లో కోస్లి సెంచరీ చేయడంతో పాటు ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఐఐటీ బాబాపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత టీవీ చానెల్ డిబేట్‌లో తనను కొట్టారంటూ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం సద్దుమణిగిందని అనుకునేలోపు తాజాగా ఆయనను గంజాయి కేసులో అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments