Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ పెట్టాలి.. ఐసీఎంఆర్

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:37 IST)
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని ఐసీఎంఆర్ కేంద్రానికి సూచించింది. అంటే దాదాపు 2 నెలలు లాక్‌డౌన్ పెట్టాలని తెలిపింది.
 
అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని ఐసీఎంఆర్ చీఫ్ బలరా భార్గవ అభిప్రాయపడ్డారు. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గిని తర్వాతే ఆంక్షలు సడలించవచ్చని అన్నారు. పాజిటివిటీ రేటు తగ్గాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్‌ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
 
లాక్‌డౌన్ వల్ల ఢిల్లీలో మంచి ఫలితాలు వస్తున్నాయని బలరాం భార్గవ తెలిపారు. ఢిల్లీలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం మనదేశంలో గోవాలోనే అత్యధిక పాజిటివిటీ రేటు ఉంది. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పుదచ్చేరి, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక ఉన్నాయి. ఏపిలో 23శాతం, తెలంగాణలో 9శాతంగా ఉంది. మనదేశంలో కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments