కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దీంతో ఈ వైరస్ గొలుసు కట్టును తెంచేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలుచేస్తోంది. దీంతో ప్రజలంతా వారివారి ఇళ్లలోనే ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ తీసుకోవాలన్న నిబంధన విధించారు.
ఈ నేపథ్యంలో కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్రమైన అభ్యర్థన చేశాడు. ఇంట్లో ఉండలేకపోతున్నాను. పిచ్చెక్కినట్టుగా అవుతుంది. శృంగార కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్యక్తి పోలీసుల్ని కోరాడు.
కన్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వాలాపట్టణం పోలీసులు అతన్ని వెతికి పట్టుకున్నారు. అయితే అక్షర దోషం వల్ల తన అప్లికేషన్‌లో పొరపాటు జరిగినట్లు సదరు వ్యక్తి పోలీసులకు క్షమాపణ చెప్పాడు.
ఇంగ్లీషులో సిక్స్ ఓ క్లాక్ అని రాయాలని అనుకున్నానని, కానీ తన దరఖాస్తులో పొరపాటున సెక్స్ అని పొరపాటున పడిందని, దీన్ని తాను గమనించలేదని తెలిపాడు. ఆ వ్యక్తి క్షమాపణలను స్వీకరించిన పోలీసులు.. అనవసర కారణాలతో ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవద్దు అంటూ అతన్ని రిలీజ్ చేశారు.
బీహార్‌లోనూ ఓ వ్యక్తి కూడా చిత్రమైన కారణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాలని కోరాడు. మొటిమల చికిత్స కోసం వెళ్లేందుకు తనకు పాస్ ఇవ్వాలని అతను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని, ఆ అకతాయికి సరైన బుద్ధి చెప్పిన విషయం తెల్సిందే.