Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ తెలిసిన ఐఏఎస్ టాపర్లు కలిసి జీవించలేక పోయారు... ఎందుకని?

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (09:21 IST)
వారిద్దరూ యువ ఐఏఎస్ అధికారులు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు శిక్షణా సమయంలో ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత ఓ ఇంటివారయ్యారు. ఈ తతంగమంతా 2015లోనే పూర్తయింది. కానీ, వారి ప్రేమ కేవలం ఐదేళ్ళలోనే విఫలమైంది. భార్యాభర్తలుగా కలిసి జీవించలేమని నిర్ధారించుకున్నారు. అంతే.. ఈ ఐఏఎస్ యువ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఎవరో కాదు.. టీనా డాబీ, అథర్ అమీర్ ఖాన్.
 
ఈ రెండు పేర్లూ బాగానే గుర్తుండే ఉంటాయి. 2015 సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో టీనా డాబీ టాపర్, అదే ఏడాది అథర్ అమీర్ ఖాన్ ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీనా సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి దళిత మహిళగా రికార్డులకెక్కారు. ఇక అథర్ అమీర్ ఖాన్ జమ్మూకాశ్మీర్‍కు చెందిన‌ వారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. 
 
ఐఏఎస్ శిక్షణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. జైపూరులోని ఫ్యామిలీ కోర్టు-1లో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరం కలిసి జీవించలేమని... తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు.
 
మరోవైపు టీనా డాబీ సోషల్ మీడియాలోని తన ఖాతాలో తన పేరు వెనుక పెట్టుకున్న ఖాన్‌ను తొలగించారు. అథర్ ఖాన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి టీనాను అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా టీనా పని చేస్తున్నారు. అథర్ అమీర్ ఈజీఎస్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments