Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్ భార్య.. తిరిగి వచ్చి ఆత్మహత్య!!

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (13:55 IST)
ఓ ఐఏఎస్ అధికారి భార్య ఓ గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయింది. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకుని ఇంటికి తిరిగివచ్చి.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. 
 
గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనులో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణీత్ కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కు ఫోన్ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
 
ఘటనపై రణ్‌జీత్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. 'ఐఏఎస్ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రణ్‌జీత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెనులోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. అలాగే, భార్య మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్ అధికారి నిరాకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments