Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రియుడే కావాలి, నువ్వు వద్దు.. భర్తతో భార్య

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:43 IST)
ప్రియుడు ఇచ్చే సుఖానికి అలవాటు పడిన ఒక వివాహిత తన భర్తకు నువ్వంటే ఇష్టం లేదు.. నాకు ప్రియుడే కావాలంటూ చెప్పింది. అంతటితో ఆగలేదు. భర్త ముందే ప్రియుడితో ఫోనులో గంటల తరబడి పిచ్చాపాటీ మాట్లాడటం.. పిలిచిన చోటికి వెళ్ళడం చేసింది. అది తప్పని చెపుతూ వచ్చిన భర్త, ఆమె మారుతుందిలే అనుకున్నాడు. కానీ ఆమెలో మార్పలు రాలేదు. హెచ్చరించాడు. భర్త హెచ్చరించడం ఏమాత్రం ఇష్టం లేని భార్య అతి దారుణంగా అతడిని ప్రియుడితో కలిసి చంపించేసింది.
 
బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ జా అనే వ్యక్తి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అతడికి భార్య ఖుష్భుదేవి, ఇద్దరు పిల్లలున్నారు. జ్యూస్ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మూడు నెలల క్రితం బీహార్‌కు చెందిన లాల్ బాబు అనే వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చాడు. ఖైరతాబాద్‌లో ఉండే లక్ష్మణ్ జా వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకొన్నాడు.
 
ఆరునెలల క్రితం తన భార్య చనిపోయిందని.. తాను ఒంటరినని, ఏదైనా పనిస్తే చేసుకుంటానని చెప్పాడు. తన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో జాలిపడి లక్ష్మణ్ జా ఉద్యోగం ఇచ్చాడు. అయితే జ్యూస్ షాపులో పనిచేస్తూ ఖుష్భూ దేవిని లైన్లో పెట్టాడు లాల్ బాయి.
 
ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం లక్ష్మణ్ జాకు తెలిసింది. భార్యను మందలించాడు. లాల్ బాబును హెచ్చరించాడు. అయినా మారలేదు. భార్య మారుతుందని భావించాడు. లాల్ బాబును పని నుంచి పంపించేశాడు. అయితే పెయింటర్‌గా వేరే పనిలో చేరిన లాల్ బాబు ఖుష్భూతో మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.
 
భర్త ముందే ప్రియుడితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం చేసేది ఖుష్బూ. ఎన్నిసార్లు హెచ్చరించినా ఖష్బూ వినిపించుకోకపోవడంతో తీవ్రంగా కొట్టాడు భర్త. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఖష్భూ ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా ఇంట్లోనే చంపేసింది. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి కటాకటాల్లోకి వెళ్ళింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments