Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేయసితో కారులో ఆ వ్యక్తి ఏం చేశాడు.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది..

Advertiesment
ప్రేయసితో కారులో ఆ వ్యక్తి ఏం చేశాడు.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది..
, గురువారం, 21 జనవరి 2021 (09:03 IST)
భర్త, ప్రేయసిని తన సోదరుడితో కలిసి ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో ఆ భర్త, అతడి ప్రియురాలు కారులో ఏం చేస్తున్నారో కూడా బయటపడటంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాంద్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బాంద్రా పరిధిలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, తన భార్యతో తరచుగా గొడవపడుతున్నాడు. 
 
దీనికి కారణమేంటా అని ఆ భార్య ఆరా తీస్తే దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో సరైన సమయం కోసం ఓపికగా వేచిచూసింది.
 
ఈ మంగళవారం తన భర్త, ప్రియురాలితో కలిసి గుడికి వెళ్లాడని ఆ భార్యకు తెలిసింది. వెంటనే ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది. అతడితో కలిసి నేరుగా గుడికి వెళ్లింది. గుడికి కాస్త దూరంగా, ఓ టిఫిన్ సెంటర్ కు కాస్త దగ్గరగా తన భర్త కారు పార్క్ చేసి కనిపించింది.
 
ఆ కారు వద్దకు భార్య, ఆమె తమ్ముడు వెళ్లారు. అప్పటికే కారులో భర్త, అతడి ప్రేయసి ఉన్నారు. కారులో వారిద్దరూ కలిసి దోశలు తింటున్నారు. కారులో టిఫిన్ చేస్తున్న వారిని ఆ భార్య బయటకు లాగింది. అక్కడే నానా రభస చేసింది.
 
వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అయితే ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేజర్లయిన ఓ స్త్రీ, పురుషుడు కలిసి ఉండటం తప్పు కాదు. కాబట్టి వారిపై కేసు పెట్టకుండా, పోలీసులు ఆ జంటను హెచ్చరించి పంపించేశారు.
 
భార్యను సరిగ్గా చూసుకోవాలంటూ అతడికి హితవు పలికారు. కాగా, ఆ భర్త ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కొత్త కాదట. పలువురు మహిళలతో అతడికి సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరా తీస్తే తెలిసిందంట. అమ్మాయిలతో కలిసి బయట తిరగడం అతడికి సరదా అని భార్యకు తెలిసింది. దీంతో అతడిని పద్దతి మార్చుకోవాలని ఆమె హెచ్చరించడం గమనార్హం. మరి ఆ భర్త తన తీరు మార్చుకుంటాడో.. లేదో.. వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది ప్రజలందరి విజయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్