Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతావనికి ప్రతీకనంటూ మతపెద్దలకు కౌంటరిచ్చిన నుస్రత్ జహాన్...

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (13:23 IST)
తాను భారతావనికి ప్రతీకను అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తనపై ఫత్వా జారీ చేసిన మతపెద్దలకు ఆమె ధీటుగా కౌంటరిచ్చింది. జన్మతః ముస్లిం అయిన నుస్రత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. అంతేనా, హిందూ పారిశ్రామికవేత్తను పెళ్లాడింది. 
 
దీంతో ఆమె ఈ నెల 25వ తేదీన లోక్‌సభలో అడుగుపెట్టింది. అపుడు మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్లెలు, నుదుట కుంకుమ బొట్టుతో లోక్‌సభలో అడుగుపెట్టింది. దీంతో ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీచేశారు. 
 
తనపై వచ్చిన విమర్శలకు నుస్రత్ శనివారం సమాధానమిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. "కుల, మత, ప్రాంతాలకు అతీతమైన భారతావనికి ప్రతీకను నేను. జన్మతః ముస్లింనైనా, నేను అన్ని మతాలను గౌవరవిస్తాను. ఇప్పటికీ నేను ముస్లింనే. నేనే ఏం ధరించాలో చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసమనేది అలంకరణకు సంబంధం లేనిది. అది అన్ని మతాలలో ఉన్న అర్థం పర్థంలేని సిద్ధాంతాలకు మించినది" అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
కొందరు మత చాందసవాదులు చేసే విమర్శలకు స్పందించడం అంటే జాతి విద్వేషాలను రెచ్చగొట్టడం, హింసను ప్రోత్సహించడమేనని.. చరిత్రే దీనికి సాక్ష్యమని ఘాటుగా వ్యాఖ్యానించారు. నుస్రత్ జహాన్‌కు బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.
 
కాగా, ఈమె ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బసీర్హత్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి 3.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మహిళా ఎంపీగా నిలిచారు. తృణమూల్ నుంచి పోటీ చేసిన 17 మంది మహిళా ఎంపీలలో ఆమె ఒకరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments