Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ విగ్రహం కూలింది.. తలవంచి క్షమాపణలు చెపుతున్నా : ప్రధాని మోడీ

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (16:57 IST)
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తలవంచి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. తొమ్మిది నెలలు కూడా పూర్తికాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని దుయ్యబట్టాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు. 
 
'నేను ఇక్కడ దిగిన వెంటనే.. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను' అని వెల్లడించారు. 'ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్దిరోజుల క్రితం కుప్పకూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments