Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ దయవల్లే సీఎం కుర్చీలో కూర్చొన్నా : కుమార స్వామి

కాంగ్రెస్ దయవల్లే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి గౌడ అన్నారు. ఈనెల 24వ తేదీన కన్నడ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తన మంత్రివర్గా

Webdunia
సోమవారం, 28 మే 2018 (13:27 IST)
కాంగ్రెస్ దయవల్లే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి గౌడ అన్నారు. ఈనెల 24వ తేదీన కన్నడ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తన మంత్రివర్గాన్ని నేడో రేపో విస్తరించనున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను సీఎం అయినట్లు తెలిపారు. సీఎంగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. కానీ ఏది చేయాలన్నా.. కాంగ్రెస్ నేతల అనుమతి తీసుకోవాలని, వాళ్ల పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేమన్నారు. 
 
కాగా, కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు రోజులు గడిచిపోయింది. అయితే ఇంకా రాష్ట్ర క్యాబినెట్‌ను మాత్రం విస్తరించలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాతో కలిసి అమెరికా వెళ్లారు. మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్, సోనియా తిరిగి వచ్చిన తర్వాతే.. కర్ణాటక మంత్రిమండలిని విస్తరించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments