Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అస‌లైన యాక్షన్‌ ఇప్పుడే మొదలవుతుంది... కర్ణాటక సీఎం కుమారస్వామి

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామి ఈ రోజు బల పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం కుమార‌స్వామి మీడియాతో మాట్లాడుతూ... తమ రాష్ట్రంలో రియల్‌ యాక్షన్‌ ఇప్పుడు మొదలవుతుందని వ్యాఖ్యానించ

Advertiesment
Karnataka CM Kumaraswamy responds on Yedurappa Comments
, శుక్రవారం, 25 మే 2018 (22:33 IST)
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామి ఈ రోజు బల పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం కుమార‌స్వామి మీడియాతో మాట్లాడుతూ... తమ రాష్ట్రంలో రియల్‌ యాక్షన్‌ ఇప్పుడు మొదలవుతుందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రజలకు తాను ఏయే హామీలు ఇచ్చానో అవన్నీ ఇక నెరవేర్చుతానని అన్నారు. 
 
24 గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్‌ నిర్వహిస్తామని బీజేపీ నేత యడ్యూరప్ప హెచ్చరించిన విషయంపై మాట్లాడుతూ, తాను ఎటువంటి బెదిరింపులను పట్టించుకోనని అన్నారు. తాము ప్రజలకు చేయాల్సింది చేస్తూనే ఉంటామని తెలిపారు. ఎవ‌రో చెబితే కానీ చేయాల్సిన ప‌రిస్థితుల్లో త‌మ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌రిపాలిస్తామ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ తెలంగాణ రైతులకు దేవుడా? ఎందుకని?