Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి జిప్మర్‌లో హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:36 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన జిప్మర్‍‌లో ఏర్పాటుచేసిన ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లి లైంగికదాడికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాండిచ్చేరి పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిలో ఒకడు కామాంధ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మరొక నిందితుడు ఈ కానిస్టేబుల్ స్నేహితుడు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. 
 
జిప్మర్‌లో వారం రోజుల పాటు జరిగే ఓ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి 20 యేళ్ల విద్యార్థిని వచ్చింది. ఈ విద్యార్థిని గురువారం రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియం ప్రాంగణంలో వాకింగ్ చేస్తూ కనిపించింది. 
 
ఆ సమయంలో బైకుపై వచ్చిన పుదుచ్చేరి కానిస్టేబుల్ కన్నన్ (31), ఆయన స్నేహితుడు శివలు కలిసి ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అమర్చివున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments