Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మరో 'దిశ' దారుణం: టీవీ నటిని హత్య చేసి తగులబెట్టారు...

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (18:17 IST)
కంచె చేను మేస్తే అన్న చందంగా తన గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్తే ఆమె పట్ల కాలయముడయ్యాడు. ఆమెను నమ్మించి తనతో తీసుకుని వెళ్లి హత్య చేసి ఆనవాళ్లు కనబడకుండా వుండేందుకు పెట్రోలు పోసి ఆమె దేహాన్ని బుగ్గి చేశాడు. పంజాబ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఇలా వున్నాయి.
 
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల అనితా సింగ్‌ టీవీ సీరియళ్లలో నటిస్తూ వుంది. ఆమె భర్త రవీందర్‌సింగ్‌ పాల్‌ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం సాగిస్తుందని అనుమానపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తాయి కానీ కలిసే వుంటున్నారు. ఐతే తన భార్య ఇదివరికటిలా తనతో వుండటం లేదనీ, దీనికి కారణం వివాహేతర సంబంధమే కారణమని భావించిన భర్త ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేసాడు.
 
వెంటనే తన మిత్రుడు సాయంతో పథకం వేశాడు. తన మిత్రుడు కుల్దీప్‌కు బాలీవుడ్ చిత్రసీమలో మంచి పరిచయాలున్నాయనీ, అతడిని కలిసి మాట్లాడితే అవకాశాలు వస్తాయని ఆమెను ఉత్తరాఖండ్‌లోని కలదుంగీకి తీసుకుని వెళ్లాడు. అక్కడ బస చేసిన హోటల్లో ఆమెకి కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోయాక సమీపంలోని అడవుల్లోకి తీసుకుని వెళ్లి గొంతు నులిమి హత్య చేసి ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు పెట్రోలు పోసి తగులబెట్టారు. 
 
ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. ఐతే మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో తమదైన శైలిలో విచారించిన పోలీసులు నిందితుడు మృతురాలి భర్తేనని తేల్చారు. దీనితో అతడిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments