Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని పట్టించుకోకుండా... స్మార్ట్‌ఫోన్‌లోనే చాటింగ్.. భార్య, బిడ్డను చంపేసిన?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:44 IST)
స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో అరచేతిలో ప్రపంచం వుందనుకుంటున్నారు చాలామంది. సోషల్ మీడియాను తెగ నమ్మేసి.. వాటి చుట్టే తిరిగేస్తున్నారు. సోషల్ మీడియాను ఎంత మేరకు ఉపయోగించాలో తెలియక బలైపోతున్నారు. అలా ఓ యువతి సెల్‌ఫోన్‌పై వున్న మోజు కారణంగా భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన రామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామ్‌కు రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా సుష్మా అనే యువతి పరిచయం అయ్యింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా ఫోనుల్లో గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో సుష్మా తల్లిదండ్రులు ఆమె ప్రేమకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సుష్మా ప్రేమ కోసం ఇంటి నుంచి బయటికొచ్చి.. ప్రియుడిని వివాహం చేసుకుంది. 
 
వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుండగా.. సుష్మ ఎప్పుడూ ఫోనులో గడపటం మొదలెట్టింది. అలా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. ఇంటి పనిని కూడా చేయకుండా ఫోనుతోనే గంటల పాటు గడిపేది. రామ్ ఎంత చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా సుష్మ పట్టించుకోలేదు. ఆపై రాజ్ తన భార్య సెల్‌ఫోన్ చూస్తే.. ఆమె పలువురితో నెట్‌లో చాట్ చేయడం గమనించాడు. 
 
చివరికి రాజ్ థీమ్ పార్క్ వెళ్దామని.. తన భార్య, 3 నెలల బిడ్డతో కలిసి రామ్ వెళ్లాడు. అక్కడికెళ్లాక రామ్ రాక్షసుడిగా మారిపోయాడు. తన భార్యను తైలం చెట్ల మధ్య ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా.. మూడు నెలల పాపాయిని కూడా వదలకుండా హత్య చేశాడు. ఆపై ఆ ఇద్దరినీ దహనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. 
 
రెండు రోజుల తర్వాత స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సుష్మతో పాటు తన మూడు నెలల మనవడు కనిపించలేదని సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి సుష్మ భర్తను విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సుష్మను, మూడు నెలల పసికందును తానే చంపానని చెప్పడంతో సుష్మ తల్లిదండ్రులు, పోలీసులు షాకయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments