Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడితో అక్రమ సంబంధం.. ఇంటికి రమ్మని పిలిచిన భర్త.. చివరికి?

Webdunia
గురువారం, 29 జులై 2021 (10:25 IST)
అక్రమ సంబంధాలతో సంసారాలు రోడ్డున పడుతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల పేరిట పెద్దలు చేస్తున్న తప్పుకు పిల్లలు అనాథలవుతున్నారు. తాజాగా..ఇలాంటి ఓ ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ…ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జస్వీర్ సింగ్,. గగన్ దీప్ దంపతులు నివాసం ఉంటున్నారు. జస్వీర్ ఇంటికి సోదరుడు మంగల్ సింగ్ వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో.. మంగల్‌తో గగన్ దీప్ మాట్లాడుకోవడం పరిపాటి అయిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తప్పని తెలిసినా..అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత…మంగల్ సింగ్ తో కలిసి వేరే ఊరికి వెళ్లిపోయింది. 
 
దీంతో జస్వీర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య ఆచూకీ తెలుసుకున్న జస్వీర్.. అక్కడకు వెళ్లాడు. ఇంటికి వచ్చేయాలని..ఇది తప్పని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కనికరించని గగన్…మంగల్ తో కలిసి జస్వీర్ పై దాడికి పాల్పడ్డారు. 
 
ఇద్దరూ కలిసి కొట్టడంతో…అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అలాగే ఇంటికి వచ్చి..మంగళవారం నాడు ఉరి వేసుకుని చనిపోయాడు. మంగల్ సింగ్, గగన్ దీప్ తన కొడుకు చనిపోయాడంటూ..తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments