Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖేష్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడు.. మెతిల్ దేవిక

Advertiesment
ముఖేష్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడు.. మెతిల్ దేవిక
, బుధవారం, 28 జులై 2021 (16:53 IST)
Mukesh_Methil Devika
ప్రముఖ మలయాళ నటుడు ముఖేష్‌కి అతడి భార్య మెతిల్ దేవిక విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎనిమిదేళ్ల తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు దేవిక మీడియా ముఖంగా వెల్లడించారు. ముఖేష్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపారు. పెళ్లై ఎనిమిదేళ్లు అవుతున్నా.. ముఖేష్ ఇప్పటికీ తనకు అర్ధం కావడం లేదని.. అందుకే అతడి నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
 
వ్యక్తిగత కారణాల వలనే తన భర్త నుండి విడిపోతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ముఖేష్ అభిప్రాయమేంటో తనకు తెలియదని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదురుకొంటున్నానని.. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ముఖేష్ పరువు తీయాలని అనుకోవడం లేదని.. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదని చెప్పుకొచ్చారు.
 
రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. అయితే ఈ విడాకులకు సంబంధించిన తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని ముఖేష్ స్పందించారు. 
 
గతంలోనే ఈయను సరిత అనే నటితో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2013లో దేవికను వివాహం చేసుకున్నారు ముఖేష్. ఇప్పుడు ఈ పెళ్లి కూడా పెటాకులు అవుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బార్లు - పబ్బులకు లేని ఇబ్బంది థియేటర్లకు ఎందుకు : హీరో నాని