Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నుంచి (స్త్రీ ధనం) డబ్బు తీసుకుంటే భర్తలు తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (08:42 IST)
భార్య నుంచి డబ్బు (స్త్రీధనం) తీసుకుంటే భర్తలకు ఎలాంటి హక్కు లేదని, తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు రూ.2 లక్షల చెక్‌ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలిరాత్రి రోజున ఆ ఆభరణాలన్నింటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. 
 
భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం.. స్త్రీ ధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికిగాను ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments