Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య జీన్స్ వేసుకుని డ్యాన్స్ చేయలేదని ట్రిపుల్ తలాక్ చెప్పాడు..

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:07 IST)
ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని నిషేధించినా.. ఇంకా తలకా కల్చర్ మాత్రం అక్కడక్కడా వెలుగు చూస్తూనే వుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఒక వ్యక్తి తన భార్య జీన్స్ వేసుకుని, డాన్స్ చేయలేదని తీన్ తలాక్ చెప్పాడు. తర్వాత అత్తారింటికి వెళ్లి తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని కాపాడి.. పోలీసులకు సమాచారం అందించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని న్యూ ఇస్లాంనగర్ నివాసి అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపుర్ పరిధిలోని పిల్‌ఖువా నివాసి అనస్‌తో నిఖా జరిగింది. అయితే గత కొంతకాలంగా అసన్ తన భార్య మహజబీని వేధిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకుని రాజ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహజలీ.. భర్త తనను జీన్స్ వేసుకోవాలని.. డ్యాన్స్  చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించింది. 
 
ఈ మాటలు విన్న పెద్దలు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. అయితే రెండు రోజుల క్రితం అనస్ ఆమె ఇంటికి వచ్చి, తీన్ తలాక్ చెప్పాడు. తరువాత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు అతనిపై నీళ్లు పోసి నిప్పును ఆర్పారు. దీంతో అనస్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని అక్కడివారు పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments