Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాటలో పోయిన డబ్బులివ్వకుంటే చంపేసేలా ఉన్నాడన్న భార్య... మరుసటి రోజు శవమైంది!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ జూదగాడు.. పేకాటలో డబ్బు పోవడాన్ని తట్టుకోలేక ఆ కోపాన్ని భార్యపై చూపించాడు. ఫలితంగా ఆమెకు కత్తితో పొడిచి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాల

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (08:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ జూదగాడు.. పేకాటలో డబ్బు పోవడాన్ని తట్టుకోలేక ఆ కోపాన్ని భార్యపై చూపించాడు. ఫలితంగా ఆమెకు కత్తితో పొడిచి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మసౌలి గ్రామానికి చెందిన మనోజ్ అకా సోనూ అనే వ్యక్తికి గాగపురా ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పెళ్లి అయింది. జూదానికి అలవాటు పడిన సోనూ పేకాటలో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో మామ ఆ డబ్బులు ఇచ్చి ఇకపై జూదం మానివేయాలని అల్లుడిని అభ్యర్థించాడు. అయినా అతడిలో మార్పు రాలేదు.
 
దీంతో మరోసారి పేకాటలో 5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును కూడా భార్యను సర్ధుబాటు చేయాలని కోరాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేసేలా ఉన్నాడని భార్య తండ్రికి ఫోన్ చేసింది. ఆ మరుసటి రోజే కూతురు మరణించిందని, అల్లుడే కూతుర్ని చంపేశాడని మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జూదగాడి నిర్వాకంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments