Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (15:54 IST)
చోరీలకు వచ్చే కొందరు దొంగలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. తాము వచ్చిన పనిని పక్కనబెట్టి హాయిగా మద్యం సేవించడం లేదా వంట చేసుకుని ఆరగించడం లేదా పడక గదిలో నిద్రపోవడం వంటి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ దొంగ హోటల్‌లో చోరీ చేసేందుకు వచ్చి ఆమ్లేట్ వేసుకుని ఆరగించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నిందితుడుని పోలీసులు అరెస్టు చేయగా, ఈ ఘటన మే నెల 22వ తేదీన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రానగర్‌లో ఓ హోటల్‌‍లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కేరళ - తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన మార్తాండ్‌కు చెందిన శివకుమార్ అనే దొంగ స్థానికంగా ఉండే ఓ హోటల్‌లో చోరీ చేసేందుకు అర్థరాత్రి సమయంలో వెళ్లాడు. హోటల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ దొంగ నేరుగా వంటగదికి వెళ్లగా, అతనికి కోడిగుడ్లు కనిపించాయి. దీంతో స్టౌవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రిజ్‌‍లో గాలించగా పచ్చి బీఫ్ ప్యాకెట్ కనిపించింది. దాంతో వంట చేసుకుని తాపీగా ఆరగరించాడు. దాదాపు గంటకుపైగా హోటల్‌ గదిలోనే గడిపినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 
 
భోజనం ముగించిన తర్వాత దొంగ హోటల్‌లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మర్చిపోయినట్టుగా భావిస్తున్న ఒక పర్సులో రూ.25 వేల నగదును తీసుకున్నాడు. ఆ తర్వాత సమీపంలోని ఓ గుడికి చెందిన హుండీని కూడా చోరీచేసి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా, బీఫ్ ప్యాకెట్ సగం మాత్రమే ఉడటం, వంటగది చిందరవందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అనుమానంతో సీసీటీవీ పుటేజీని పరిశీలించగా దొంగ చేసిన పనులు బయటపడ్డాయి. దీంతో మే 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ విజువల్స్‌ను పాలక్కాడ్ పోలీసులకు అందజేయగా వారు కేసు నమోదు చేసి, ఆ దొంగను గుర్తించి అరెస్టు చేశారు. దొంగను శివకుమార్‌గా గుర్తించారు. పాలక్కాడ్‌లోని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments