ప్రియుడితో ఏకాంతంగా పట్టుబడిన భార్య.. ఇద్దరికీ పెళ్లి చేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (15:26 IST)
బిహార్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో కట్టుకున్న భర్త కుటుంబ సభ్యులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న భర్త... తన భార్యను ఆమె ప్రియుడికిచ్చి వివాహం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాకు చెందిన ఓ వివాహితకు అదేప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది చాలా కాలంగా సాగుతోంది. పైగా, అతడికి అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ప్రియుడు ఎప్పటిలాగే ఆమెను కలిసేందుకు ఇటీవల ఓ రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త కుటుంబ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో వారు ప్రియుడిని బందీగా చేశారు. పైగా, అక్రమ సంబంధం పెట్టుకున్న జంట గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామపెద్దలు ఆదేశించారు. 
 
ఇంతలో వివాహిత భర్త ఇంటికి రావడంతో అసలు విషయం తెలిసింది. తన భార్య చేసిన పాడు పనికి ఏమాత్రం చింతించకుండా ఆమెకు తగిన విధంగా గుణపాఠం చెప్పాడు. తన  భార్యకు, ఆమె ప్రియుడికి స్థానికంగా ఉండే గుడిలోనే పెళ్లి జరిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రియుడు వివాహిత నుదుటిపై కుంకుమ పెట్టే సమయంలో ఆమె వలవలా ఏడ్చేసింది. కాగా, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments