ఎంపీలో ఘోరం.. 8 యేళ్ల చిన్నారిని రక్షించడానికెళ్లి 40 మంది బావిలోపడ్డారు...

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (15:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బావిలోపడిన 8 యేళ్ళ చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన వారిలో 40 మంది ఆ బావిలోనే పడ్డారు. వీరంతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావడం గమనార్హం. ఓ ట్రాక్టర్ కూడా బావిలో పడింది. వీరిలో అతికష్టం మీద 23 మందిని రక్షించారు. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా 13మంది గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 
బాలికను రక్షించే సమయంలో బావి చుట్టూ జనం గుమిగూడారని పోలీసులు తెలిపారు. ప్రజల గుంపు కారణంగా ఒత్తిడి పెరిగిపోయి బావి చుట్టు ఉన్న సరిహద్దు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 40 మంది 40 అడుగుల లోతైన బావిలో పడిపోయారు. 
 
అయితే 23 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ తెలిపారు. ఇందులో 13 మందిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ఈ సంఘటనపై సీఎం శివరాజ్ సింగ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన మంత్రి విశ్వస్ సారంగ్‌ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments