Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో సరికొత్త ప్రయోగం.. సీట్లు ఎక్కడొచ్చినా నచ్చిన కాలేజీలో...

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (15:33 IST)
తెలంగాణ విద్యాశాఖ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సీటు ఎక్కడొచ్చినప్పటికీ.. పాఠాలు మాత్రం నచ్చినప్పటికీ సమీపంలోని మరో కాలేజీలో కొన్ని రోజుల పాటు క్లాసులు వినే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. డిగ్రీ స్థాయిలో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. 
 
ఇందుకోసం క్లస్టర్ విధానాన్ని తీసుకురానుంది. ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణతో పాటు పలు వైస్ ఛాన్సలర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ ఇటీవల ఏర్పటై కస్టర్ల ఏర్పాటుపై సమాలోచనలు చేసింది. కస్టర్లు ఎలా ఎర్పాటు చేయాలి? ఎన్ని కాలేజీలు కలుపుతూ ఓ క్లస్టర్ చేయాలి? తదితర అంశాలపై కమిటీ చర్చించింది. అయితే.. ఈ క్లస్టర్లలో కనీసం 6 కాలేజీలు ఉంచాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
 
ఇందులో రెండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీలను కలిపి ఉంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. మొదట ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలన్నది అధికారుల ప్లాన్‌గా అమలు చేయాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments