Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కుమారుడు అంత డబ్బు ఎలా సంపాదించాడో?: అమిత్‌షాకు మమతా కౌంటర్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:59 IST)
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తృణమూల్‌, విపక్ష బిజెపి నేతలు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు కాస్తా..కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేసే స్థాయికి చేరాయి.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా...బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆమె మేనల్లుడు, తృణమూల్‌ ఎంపి అభిషేక్‌ బెనర్జీని రాజకీయ వారసుణ్ణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించగా...మమతా..అమిత్‌షా కుమారుడిపై విమర్శలు గుప్పించారు. బి వర్సెస్‌ బి (భాతిజా (మేనల్లుడు) వర్సెస్‌ బేటా (కుమారుడు) అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

మోడీ సర్కార్‌ గరీబ్‌ కళ్యాణ్‌ కోసమైతే, మమతా సర్కార్‌ భాతిజా కళ్యాణ్‌ కోసం అంటూ కోచ్‌ బెహరాలో అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మేనల్లుడ్ని ముఖ్యమంత్రి చేయాలన్న యోచనలో మమతా ఉన్నారని, ఒక వేళ దిలీప్‌ ఘోష్‌ ఇక్కడ పోరాడకపోతే..ఇప్పటికే ఎప్పుడో ఆయన పేరును ప్రకటించేవారంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అన్నారు.

అమిత్‌షా వ్యాఖ్యలపై మమతా కొన్ని గంటల్లోనే కౌంటరిచ్చారు. తాను మేనల్లుడు కోసం పరితపిస్తున్నానని వారు(అమిత్‌షా) అంటున్నారని, మరీ మీ కుమారుడు సంగేతంటనీ? ఎదురు ప్రశ్నించారు.

బెంగాల్‌లో ఉన్నందున తాము చెడ్డవాళ్లమయ్యామని, మరీ మీ కుమారుడు అంత డబ్బు ఎలా సంపాదించాడో... ముందు దానికి సమాధానం చెప్పండంటూ ప్రశ్నించారు. తాము వాస్తవాలు మాట్లాడతామని, మాతో మాటల యుద్ధానికి దిగితే...మీ పరువే పోతుందంటూ మమతా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments