Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో జైలు టూరిజం

Advertiesment
మహారాష్ట్రలో జైలు టూరిజం
, బుధవారం, 27 జనవరి 2021 (10:07 IST)
జైలు అనగానే నేరస్థుల శిక్షాస్థలం అనే అందరం అనుకుంటాం! కానీ జైళ్లు కూడా.. ఒకప్పటి భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌వారి కౌగిలిలో చిక్కిన భరతమాత సంకెళ్లను తెంచే ఆయుధాలుగా మారాయి. ప్రత్యేకించి యరవాడ జైలు గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆ జైలులోనే 1932లో పూనా ఒప్పందం జరిగింది.

దానిపై జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సంతకం చేశారు. అలాగే ఆరోజున మహాత్మాగాంధీ ఏ చెట్టు కింద కూర్చొని సంతకం చేశారో.. ఆ చెట్టు ఇప్పటికీ జైలు ప్రాంగణంలో అలాగే ఉంది. గాంధీజీ, బాలగంగాధర్‌తిలక్‌ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.

పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, మోతీలాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభారు పటేల్‌ కూడా అరెస్టయి ఈ జైలులోనే శిక్షననుభవించారు. చాపేకర్‌ సోదరుల ఉరితీత ఇక్కడే. అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్‌ను ఈ జైలులోనే ఉరితీశారు.

ఈతరం విద్యార్థులకు జైలు గురించి, దాని ప్రాధాన్యత గురించి పెద్దగా తెలియడం లేదు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం యరవాడ జైలు గురించి ప్రత్యేకతను తెలియజేయాలనే ఉద్దేశంతో జైలు టూరిజంకు తలుపులు తెరిచింది.

ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే సందర్భంగా జైలు టూరిజాన్ని ప్రారంభించనుంది. దీనికి కేవలం రోజుకు యాబై మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అది కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి. జైలు పర్యటనకు వచ్చిన విద్యార్థులకు గైడ్‌లుగా జైలు సెక్యూరిటిగార్డులు వ్యవహరిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నెర్రజేసిన నిమ్మగడ్డ : ద్వివేది - గిరిజా శంకర్‌లపై అభిశంసన!