Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ హోటల్‌లో 'వస్త్రాపహరణ' : మహిళా ఉద్యోగి చీర లాగిన సీనియర్ మేనేజర్ (Video Viral)

దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తన కింద పనిచేస్తున్న ఓ యువతి చీరను సీనియర్ ఉద్యోగి లాగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, అవిప్పుడు సోషల్ మీడి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (13:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తన కింద పనిచేస్తున్న ఓ యువతి చీరను సీనియర్ ఉద్యోగి లాగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీలోని ఓ నక్షత్ర హోటల్‌లో 33 యేళ్ల మహిళ పని చేస్తోంది. హోటల్‌లో సెక్యూరిటీ మేనేజర్‌గా పని చేస్తున్న సీనియర్ ఉద్యోగి పుట్టిన రోజునాడు ఆమెను లైంగికంగా వేధించాడు. దీనిపై బాధిత మహిళ తన భర్త సాయంతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. 
 
"గత నెల 29వ తేదీన నా పుట్టిన రోజు. ఆయన తన క్యాబిన్‌కు నన్ను పిలిచాడు. క్రెడిట్ కార్డు తీసి చూపుతూ ఏం బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు. తన పక్కన కూర్చోమని చెప్పాడు. నేను కూర్చోకుంటే, చీర కొంగు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. పక్కన ఉన్న ఇతర ఉద్యోగులను బయటకు వెళ్లాలని ఆదేశించాడు. రాత్రికి తనతో గడపాలని అడిగాడు" అంటూ బోరున విలపిస్తూ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది. 
 
పైగా, జరిగిన ఘటనను ఆమె అదే రోజు హోటల్ మానవ హక్కుల విభాగం దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. చివరకు తన భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పింది. అదేసమయంలో ఈ ఘటనంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఈ వీడియోను మరో హోటల్ సిబ్బంది బాధితురాలికి అందజేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. మరోవైపు.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ మహిళా ఉద్యోగిని హోటల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. అలాగే, సీసీటీవీ ఫుటేజ్‌ని ఆమెకు అందించిన మరో సహోద్యోగిని కూడా తొలగించగా, ఈ విషయంలో దుమారం చెలరేగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం