Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్.. పట్టించుకోని డాక్టర్లు.. కడుపులోనే శిశువు మృతి

వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉందని వైద్యం చేయాల్సిన డాక్టర్లు పట్టించుకోలేదు. నిండు గర్భిణిని పట్టించుకునేవారు లేకపోవడంతో కడుపులోనే బిడ్డ చనిపోయాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నా

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (16:59 IST)
వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉందని వైద్యం చేయాల్సిన డాక్టర్లు పట్టించుకోలేదు. నిండు గర్భిణిని పట్టించుకునేవారు లేకపోవడంతో కడుపులోనే బిడ్డ చనిపోయాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నెలలు నిండిన భార్యని ప్రసవానికి 50కి.మీ. దూరాన ఉన్న బరేలీలోని ఒక ఆసుపత్రికి ఆమె భర్త తీసుకువెళ్లాడు. 
 
వైద్యం అందిచాల్సిన డాక్టర్లు ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉందని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. అతను ఎంత ప్రాధేయపడినా వైద్యం చేయమని వేరే ఆసుపత్రికి తీసుకుపొమ్మని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. అర్ధరాత్రి సమయంలో చేసేది లేక దిక్కుతోచని స్థితిలో భార్యను తీసుకుని అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు వెంటనే సిజేరియన్‌ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
సకాలంలో వైద్యం అందక శిశువు చనిపోయింది. ముందే వైద్యం చేసి ఉంటే బిడ్డ బతికేదని, తమ బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఆసుపత్రి యాజమాన్యమే అని దంపతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments