Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో హెయిర్ క్లిప్ దొంగతనం చేసిందని.. వాతలు పెట్టిన టీచర్.. ఎక్కడ?

తన ఇంట్లో హెయిర్ క్లిప్ దొంగతనం చేసిందని ఒక చిన్నారిని ఓ టీచర్ దారుణంగా కొట్టి వాతలు పెట్టిన ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకుంది. 12 ఏళ్ళ బాలిక తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోగా, తల్లి మరో వ్యక్త

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (16:32 IST)
తన ఇంట్లో హెయిర్ క్లిప్ దొంగతనం చేసిందని ఒక చిన్నారిని ఓ టీచర్ దారుణంగా కొట్టి వాతలు పెట్టిన ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకుంది. 12 ఏళ్ళ బాలిక తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుమార్తెను బంధువుల ఇంట్లో వదిలేసింది. పాపనాశనంలోని ఉపాధ్యాయురాలైన రోహిణి ఇంట్లో ఉంటున్నఈ పాప, ఆమె పనిచేస్తున్న స్కూల్‌లోనే ఏడవ తరగతి చదువుతోంది.
 
మూడు రోజుల క్రితం రోహిణి ఇంట్లో హెయిర్ క్లిప్ కనిపించకుండా పోయింది. దీంతో ఆ బాలికే చోరీ చేసిందని అనుమానించిన రోహిణి, ఆమె కుమార్తె శరణ్య అట్లకాడతో వాతలు పెట్టారు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కార్మిక, సామాజిక శాఖ, చెల్డ్ హెల్ప్ లైన్‌కు చెందిన అధికారులు టీచర్ ఇంటికి వచ్చారు. 
 
పాప చేతిపై కాలిన వాతలను చూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో బాలికను తంజావూరులోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. ఈ విషయంపై టీచర్, ఆమె కుమార్తె వేధింపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

పృథ్వీరాజ్‌ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments