Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (09:29 IST)
మహారాష్ట్రలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు హెచ్‌ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాకు చెందిన హెచ్ఐవీ బాధిత బాలిక లాథుర్ జిల్లాలోని బాలికల ఆశ్రమంలో ఉంటోంది. రెండేళ్లుగా ఆ బాలిక అక్కడే నివసిస్తోంది. అందులో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లలో ఆ బాలికపై నాలుగు సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ విషయంలో చిల్డ్రన్ షెల్టర్ హోమ్ నిర్వాహకులు సైతం ఆమెకు సహాయం చేయలేదు. అధికారులకు రాసిన ఉత్తరాలను సైతం వారు చింపేశారు.
 
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతిగా తేలింది. దీంతో అత్యాచారం చేసిన నిందితుడు డాక్టర్‌తో కుమ్మక్కై బాలికకు తెలియకుండానే అబార్షన్ చేయించాడు. అనంతరం బాలిక ధోకీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 
 
అనంతరం ఈ కేసును ఆశ్రమం ఉన్న ఆసా స్టేషన్‌కు బదిలీ చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు లాథుర్ జిల్లా ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు. అరెస్టు అయిన వారిలో సేవాలే ఆశ్రమం ఫౌండర్ రవి బాపట్లే, సూపరింటెండెంట్ రచన బాపట్లే, ఉద్యోగులు అమిత్ మహముని, పూజ వాఘ్మరి ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments